డ్రైనేజీ పరిశీలన

ప్రజాశక్తి-మద్దిపాడు : డ్రైనేజ్‌ కాలువను పంట కాలువ ఏర్పాటు చేయడం ఏమిటని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మద్దిపాడు బీసీ కాలనీలో డ్రైనేజీ కోసం తవ్విన గుంత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మించేందుకు గుంత తీసినట్లు తెలిపారు. గుంత పది అడుగుల లోతున తీసినట్లు తెలిపారు. దీంతో అది పంట కాలువను తలపిస్తుందన్నారు. గుంతలు తీసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ పనులు చేపట్టలేదని తెలిపారు. గుంతల నిండా మురుగు నీరు నీరి దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు. దీంతో రాత్రి సమయంలో కాలనీ వాసులు దోమలతో యుద్ధం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ నిర్మాణం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

➡️