‘తంగిరాల డ్యాం పేరుతో రైతులకు ఎమ్మెల్యే మోసం’

వినుకొండ:  తంగిరాల డ్యాం పూర్తిచేసి వినుకొండ, నూజెండ్ల మండలాల్లో గ్రామాలకు సాగు త్రాగునీరు అందిస్తామని వాగ్దానం చేసిన మాట తప్పిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును గ్రామ పొలిమేరలోకి కూడా రానివ్వకుండా నిలిపియాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు  జీవీ ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపేందుకు ఆదివారం తంగిరాళ్ల గుండ్లకమ్మ స్పాట్‌ను రైతులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు బ్రహ్మనాయుడు తాము అధికారంలోకి రాగానే తంగిరాల డ్యాం నిర్మించి నూజెండ్ల మండలం లోని నాగిరెడ్డిపల్లి, ముత్యంజయపురం ,తంగిరాళ్ల , లింగంపల్లి, చింతలచెరువు, వినుకొండ మం డలం నీల గంగవరం, కొప్పుకొండ, దొండపాడు, నడిగడ్డ, శివాపురం, చీకటి గల పాలెం, రామిరెడ్డి పాలెం, పార్వతీపురం గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ని గ్రామాల్లో చివరి భూములు ఆయకట్టుకు సాగునీరు, శాశ్వతంగా తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎగువలో ఫ్యాక్టరీలు ఉన్నాయని, డ్యాం నిర్మిస్తే ఫ్యాక్టరీలు గ్రామాలు మునిగిపోతాయని చెబుతున్న ఆయనకు నాడు ఆ ఫ్యాక్టరీలు, గ్రామాలు కనపడలేదా అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే కట్టుకథలు చెప్పి మోసం చేశాడని ఆయా గ్రామాల రైతులకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నూజెండ్ల మండలం కొండలరాయుని పాలెం, ములకలూరు, ఖమ్మంపాడులో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు వస్తే పనులు చేయటం చేతగాని అస మర్ధుడు బ్రహ్మనాయుడు అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే వినుకొండ నియో జకవర్గంలో తాగుసాగు నీటి సమస్యను పరి ష్కరించేందుకు మొదటిగా వరికపూడిశెల, గుం డ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో చెక్‌ ద్యాంలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు, పల్నాడు వాటర్‌ గ్రిడ్‌, పట్టణ శాశ్వత త్రాగునీటి పథకాలు పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డి ఎల్‌ డి ఏ చైర్మన్‌ లగడపాటి వెంకటరావు,మండల పార్టీ ప్రెసిడెంట్‌ మీసాల మురళీకృష్ణ యాదవ్‌, బచ్చు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరటం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

➡️