దున్నపోతులకు వినతిపత్రాలతో అంగన్‌వాడీల నిరసన

మండపేటలోదున్నపోతుకు వినతి పత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల పరిష్కారంకోసం అంగన్‌వాడీలు సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని దున్నపోతులకు వినతిపత్రాలు ఇచ్చి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ డిమాండ్లను నెరవేర్చాలని దున్నపోతుకు వినతిపత్రం అందించి వినూత్నంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26వేలు, పిఎఫ్‌ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి,రాణి తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 22రోజులు నుంచి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేస్సున్న ప్రభుత్వం పటింసుకోకపోవడంతో దున్నపోతుకి సమస్యలు వినతిపత్రం అందచేసి అంగన్‌వాడీలు విన్నుతనిరసన తెలిపారు. ఈసమ్మెకు యుటిఎఫ నాయకులు కుడిపూడి సత్యనారాయణ తదితరులు మద్దత్తు తెలిపారు.

 

➡️