ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Dec 14,2023 23:46 #hanumantharao, #Mangalagiri, #MLC, #Paddy

 మంగళగిరి రూరల్‌్‌: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్య క్రమం మంగళగిరి మండలంలోని రామచంద్రా పురంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి లు గురువారం ప్రారం భించారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువ కు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా దళారులు, మధ్యావర్థుల ప్రమేయం లేకుండా రైతుభరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు గా పనిచేస్తాయని తెలిపారు. అలాగే రైతులు ఇబ్బంది పడ కుండా చూడాలని అధికారులకు మురుగుడు హను మంతరావు తెలిపారు. గంజి చిరంజీవి మాట్లాడుతూ ప్రతి, వరి సాగు చేసే రైతులు ఈ అవకాశం విని యోగించు కోవాలని కోరారు. కార్యక్రమం లో దుగ్గిరాల సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, మంగళగిరి డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు జి. శ్రీనివాసరెడ్డి, మంగళగిరి మండల వ్యవసాయ అధికారి జడ్‌. శైలజా రాణి, విఎఎలు ప్రశాంత్‌, రాజేశ్వరి పాల్గొన్నారు.

➡️