ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని నిడమానూరులో గురువారం ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ కాంత్ రాజ్ కుమార్, సెక్రటరి అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణ, తహశీల్దార్ ఏ శ్రీనివాసరావు, విశ్రాంత ఏఎస్‌పి సుంకర సాయిబాబు, ఎంపిడిఓ మహాలక్ష్మి, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.
