నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి

కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలసి వెబ్‌ సైట్‌ ప్రారంభిస్తున్న పల్నాడు జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

పల్నాడు జిల్లా: గ్రామీణ ప్రాంతం నుండి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్‌ఆర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రొంపిచర్లకు చెందిన యువకులు, కన్స ల్టెన్సీ ప్రతినిధులు వెంగళరాజు లెనిన్‌ బాబు, కె.సతీష్‌, కె.రామాంజనేయులును జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ అభినందించారు. సోమవారం స్పందన సమా వేశ మందిరంలో ఎంఎల్‌ఆర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ వెబ్‌ సైట్‌ను జాయింట్‌ కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సరైన అవగాహన లేని యువతను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఎల్‌ఆర్‌ కన్సల్టెన్సీ ప్రతి నిధులకు సూచించారు. కన్సల్టెన్సీ విధానాన్ని పూర్తి వాణిజ్య పరంగా కాకుండా అంకితభావంతో నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందని అన్నారు. మంచి ఆశయంతో తమ కన్సల్టెన్సీని ప్రారంభించామని, ఇప్పటికే ఎంతో మంది యువ తకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పనకు తమ వంతు కృషి చేశామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ను యువత సందర్శించి నూతన సాం కేతికను అందిపుచ్చుకుని, ఉపాధి అవకాశాలు దక్కించు కోవాలని కోరారు. ఇతర దేశాలలో విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచి పల్నాడు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిం చారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విదే శాలలో విద్య అభ్యసించడం కోసం తోడ్పాటు అందించడమే తమ కన్సల్టెన్సీ ముఖ్య ఉద్దేశమన్నారు.

➡️