నీటి సమస్యను పరిష్కరించాలి : సిపిఎం

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణంలో నీటి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి. కేశవరావు డిమాండ్‌ చేశాడు. సిపిఎం కనిగిరి పట్టణ కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసికేశవరావు మాట్లాడుతూ కనిగిరి పట్టణంలోని వార్డులలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరా గత వారం రోజులుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచి పోయిటన్లు తెలిపారు. 9, 16 వార్డులు ఇందిరా కాలనీ, బీసీ కాలనీ, సాయి నగర్‌ కాలనీ తదితర ప్రాంతాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఏడుకొండలు, ఎస్‌కె. బషీరా, నరేంద్ర, కాశయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️