నీట మునిగిన నిమ్మ మార్కెట్‌ యార్డు

Nov 28,2023 20:45
నీరు చేరిన దృశ్యం

నీరు చేరిన దృశ్యం
నీట మునిగిన నిమ్మ మార్కెట్‌ యార్డు
ప్రజాశక్తి -పొదలకూరు :జిల్లాలో పెద్ద మార్కెట్‌ అయినా పొదలకూరు వ్యవసాయ నిమ్మ మార్కెట్‌ యార్డు నీటిమునిగింది. పాలకులు, అధికారులు గాలికొదిలేశారు. మార్కెట్‌ యార్డ్‌ స్థానికంగా ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తోంది. ఇప్పటికీ మెరుగైన సౌకర్యాలకు నోచుకోలేదు. చిన్నపాటి వర్షం కురిసిన నిమ్మ మార్కెట్‌ యార్డులోని దుకాణాలను నీట మునుగుతున్నాయి. గత ప్రభుత్వ హాయంలో 2016లో 24 దుకాణాలు నిర్మించి నిమ్మ వ్యాపారస్తులకు అప్పజెప్పింది. కావాల్సిన ప్రహరీ గోడ, రోడ్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మ మార్కెట్‌ యార్డుపై ప్రత్యేక చోరవ చూపకపోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. రోడ్లు ఎత్తుగా ఉండడం, డ్రెయినేజీ కాలవలు లోతట్టు గా ఉండడంతో చిన్నపాటి వర్షం కురిసిన డ్రెయినేజీ నీళ్లన్నీ దుకాణాల్లోకి ప్రవహిస్తున్నాయి. దీంతో తోతట్టులో ఉన్న దుకాణాలన్నీ నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీటితో దుకాణాలన్ని మునిగి పోవడంతో , వ్యాపార కార్యకలాపాలన్నీ స్తంభించి పోతున్నాయి. ఎఎంసి సెక్రటరీకి తమ సమస్యను పలు మార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వ్యాపారస్తులు చెబుతున్నారు.మార్కెట్లో ఉండే 47 దుకా ణాల్లోలో 9 దుకాణాలు పూర్తిగా చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా డ్రెయినేజీ కాలువలు ఎత్తు లేపి నిమ్మ కాయల కొట్లు మునిగిపోకుండా చూడాలని కోరుతున్నారు. నిమ్మ మార్కెట్‌ యార్డులో గతంలో పెట్టిన ప్రహరీ గోడ గేటు కూడా పూర్తిగా విరిగిపోయిందని, నూతన గేట్లను అమర్చాలని వ్యాపారులు విన్నవించారు.

➡️