ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి ప్రజల ఆస్తులకు భద్రత లేని నూతన భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లక్కి రెడ్డిపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎల్.రామచంద్రారెడ్డి, కార్యదర్శి చెన్నకష్ణయ్య అన్నారు. భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కడప, అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్‌లు టి.ఈశ్వర్ నేతత్వంలో గురువారం లక్కిరె డ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 512 రద్దు చేయాలన్నారు. కోర్టులను అవమానించే ఆక్ట్ 27/ 23ను అమలు చేయడం ఆపాలని న్యాయవ్యవస్థను అదుపు ఆజ్ఞల్లో పెట్టుకునే విధంగా తయారుచేసిన ఈ భూహక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎల్.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆస్తుల వివాదాలపై హక్కును నిర్ణయించే అధికారం రెవెన్యూ అధికారులకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అన్నారు. రెవెన్యూ అధికారులకు ఆస్తులు, వివాదాల హక్కును నిర్ణయించే అధికారం లేదని గతంలో అనేక రకాలుగా సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం ప్రతి ఒక్కరూ వ్యతిరే కించాలని అన్నారు. సీనియర్ న్యాయవాది చెన్నకష్ణయ్య మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి కూడా రెy ెన్యూ కోర్టులు ఇచ్చే తీర్పులను న్యాయవ్యవస్థ గౌరవిస్తూనే ఉందని తెలిపారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం న్యాయవాది రవిశంకర్, టివి.రమణ, వి.రాజ్ కుమార్, సుబ్బరాయుడు, శివశంకర్ వెంకట స్వామి పాల్గొన్నారు.
