ప్రజా ప్రతినిధులతో మండల అభివృద్ధి అధికారి తదితరులు
ప్రజాశక్తి-మండపేట
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్యదర్శులకు రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మండల అభివద్ధి అధికారి ఐదం రాజు మాట్లాడుతూ ఈ శిక్షణలో గ్రామ పంచాయతీలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ తడితర అంశములపై ప్రణాళికతో పాటు సూచనలు సలహాలు అందించామన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు వివిఆర్‌కె.రాజు, కె.సాయి ప్రసాద్‌లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పరిపాలన అధికారి విఎన్.ప్రసాద్, మండల ఇంజినీరింగ్ అధికారి నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు పాల్గొన్నారు.