పకడ్బందీగా ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు : ఆర్‌జెడి

ప్రజాశక్తి – రాయచోటి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం (ఎపి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రాఘవరెడ్డి అధికా రులకు సూచించారు. శనివారం స్థానిక డైట్‌ విద్యా కేంద్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న చీఫ్‌ సూపరిం టెండెంట్లకు, డిపార్ట్మెంట్‌ అధికారులకు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పరీక్ష లను నిర్వహించాలన్నారు. డిఇఒ శివప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ రెగ్యులర్‌ విద్యా ర్థులకు ఉదయం పూట, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పరీక్ష ఉంటుందన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్‌ అధికారులు తమకు కేటాయించిన కేంద్రంలో పరీక్షల నిర్వహణకు అన్ని వసతులు ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోవాలన్నారు. జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో-ఆర్డినేటర్‌ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలను 16 కేంద్రాలలో నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనంతరం ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల రాష్ట్ర కో- ఆర్డినే టర్‌ అక్బర్‌ ఆలీ మాట్లా డుతూ విద్యార్థికి హాల్‌ టికెట్‌లో సబ్జెక్టు అయితే ఉంటుం దో అదే సబ్జెక్టు ప్రశ్న పత్రం జారీ చేయాలన్నారు. వేరే సబ్జెక్టు ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలు రాయిస్తే ఫలి తాలు నిలిపివేస్తామని తెలిపారు. ఈ విషయమై ఇన్విజి లేటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కడప జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో-ఆర్డినేటర్‌ సుబ్బారెడ్డి, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్లు అధికారులు పాల్గొన్నారు.

➡️