పదలకు సాయం చేయడం సంతృప్తినిస్తుంది

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతప్తి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజాద్‌బాష, ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక నగరంలోని అక్కయపల్లెలోని మస్జిద్‌ ఏ మెహరున్నిసా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో రానున్న రంజాన్‌ మాసం పురస్కరించుకుని 250 మందికి 19 రకాల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలీముల్లా రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని నిత్యావసరాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రంజాన్‌ మాసంలో ప్రతి ముస్లిం అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానం, ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రామకృష్ణారెడ్డి, కార్పొరేటర్‌ అజ్మతుల్లా ఖాన్‌, నాయకులు నారపరెడ్డి సుబ్బారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, చోటు పాల్గొన్నారు.

➡️