‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం

ప్రజాశక్తి- రాయచోటి ఈనెల 18 నుంచి నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించడమే తమ లక్ష్యమని జిల్లా విద్యా శాఖ అధికారి యు.శివ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి, కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నారు వంటి వాటిపై ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.అన్నమయ్య జిల్లాలోని పాఠశాలల వివరాలు తెలియజేయండి? అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 492 పాఠశా లలున్నాయి. ఎయిడెడ్‌ 5, ఎపిఎంఎస్‌ 17, ఎపి ఆర్‌ఎస్‌ 6, ఎఎస్‌హెచ్‌ఆర్‌ఎఎం1, బిసి వెల్ఫేర్‌ 4, ప్రభుత్వ కెజిబివి 22, ఎంపిఎల్‌ 5, ప్రయివేట్‌ 190, స్కూల్‌ వెల్ఫేర్‌ 11, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 8, జడ్‌పి 214 పాఠశాలలున్నాయి.పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ వివరించండి? పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 నిమిషాల వరకు జరుగుతాయి. మార్చి 18న ఫస్డ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, 20న ఇంగ్లిష్‌, 22న మ్యాథ్స్‌, 23న ఫిజికల్‌ సైన్స్‌, 26న బయాలజీ, 27న సోషల్‌ స్టడీస్‌, 28వ తేదీ మొదటి లాంగ్వేజ్‌ పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్సు)/ ఓఎస్‌ ఎస్‌ ఇ మెయిన్ల గ్వేV్‌ా పేపర్‌ -1, 30న ఒఎస్‌ఎస్‌ ఇ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2 (సంస్కతం, అరబిక్‌, పర్షియన్‌), వొకేషనల్‌ కోర్సు పరీక్ష ఉంటుంది.ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా 25,522 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 22,466, బాలురు 11,254,బాలికలు 11, 212, ఒక్కసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు 3056, బాలురు 1749,బాలికలు 1307 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.పరీక్ష కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా 129 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఎ కేటగిరి 58, బి కేటగిరి 55, సి కేటగిరి 16 సెంటర్లు ఏర్పాటు చేశాం.పరీక్షలకు ఎంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు? చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసర్లు 129, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు 129, రూట్‌ ఆఫీసర్లు 10, ప్లేయింగ్‌ స్క్వాడ్‌ ఆరుగురిని నియమించాం.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నారా? ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కుమార్‌ అన్ని అధికారులతో జిల్లా అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష జరిగే సమయంలో ఉదయం, మధ్యాహ్నం ఆర్‌టిసి బస్సును సౌకర్యాలు కల్పిస్తున్నాం. పరీక్ష సమయంలో విద్యుత్‌ అంత రాయం లేకుండా అన్ని చర్యలు తీసుసుకుంటున్నాం. పరీక్షల కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ప్రతి సెంటర్‌లో ఎఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. తాగనీరు, మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశాం. జిరాక్స్‌ సెంటర్లను కూడా మూసివేస్తున్నాం. మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసుకురాకూడదు.విద్యార్థులకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? విద్యార్థులు టీవీలు, సెల్‌ ఫోన్‌లకు దూరంగా ఉండాలి. విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సెంటర్లోకి విద్యార్థులు 30 నిమిషాలు ముందుగానే హాజరు కావాలి. విద్యార్థులకు ప్రతి సెంటర్లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం. కావున విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్ష్షలు రాసి అన్నమయ్య జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి అందరూ సహకరించాలి.

➡️