పదివేలమందికి అన్నదానం

అన్నదాన కార్యక్రమంలో  భక్తులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రసిద్ధ పంచరామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయనికి రాష్ట్ర నలమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులు కిక్కిరిసిపోవడంతో మెయిన్‌ రోడ్లన్నీ జన సందోహంతో నిండిపోయాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎటు చూసినా ప్రయాణికులు నిండిపోవడంతో రోడ్లన్నీ కిటకిటలడాయి. అదేవిధంగా హసన్‌బాద భీమేశ్వరాలయంలోనూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఇఒ తారకేశ్వరరావు పర్యవేక్షించారు. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ నియంత్రణ చేశారు.

 

➡️