ప్రజాశక్తి – కడప ప్రతినిధిపదవ తరగతి ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనకు పంచతంత్ర వ్యూహంతో సమ్మే టివ్, ఫార్మేటివ్ అసెస్మెంట్, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ప్రణాళికా బద్దంగా అమలు చేశాం. మెటివేషనల్ ప్రోగ్రామ్స్‌తో టెన్త్ ఎగ్జామ్స్ పట్ల యువతలో నెలకొన్న భయాన్ని రూపుమాపే ప్రయత్నం చేయడమైంది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలుకుని ఇన్విజిలేటర్ల దగ్గర నుంచి సిట్టింగ్, ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ నియామకాల వరకు అన్ని ఏర్పాట్లనూ చేయడమైందని పేర్కొంటున్న జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డితో ముఖాముఖి…పది ఫలితాల మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటి? సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయడం దగ్గర నుంచి సమ్మెటివ్, ఫార్మేటివ్, అసెస్మెంట్ పరీక్షలు నిర్వహణతోపాటు మోటి వేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేశాం. దీనికితోడు 100 రోజుల పంచతంత్ర ప్రణాళిక అమలును క్లోజ్ మానిటరింగ్ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నాం.పదవ తరగతి విద్యార్థులు వివరాలు తెలపండి? జిల్లాలోని 581 ప్రభుత్వ, ప్రయివేటు, అన్‌ఎయిడెడ్ పాఠ శాలల నుంచి 27,858 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి లో 14,269 మంది బాలురు,13,589 మంది బాలికలు పరీక్షలకు హాజరవనున్నారు. గతేడాది కడప జిల్లా 73 శాతం పలితాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈఏడాది డిఇఒతో కలిసి మెరుగైన ఫలితాల సాధించేలా కృషి చేశాం.కెజిబివి విద్యార్థుల సంఖ్య ఎంత? 17 కెజిబివి పాఠశాలల తరుపున 614 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారు. గతేడాది 72 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ఆరవ స్థానంలో నిలిచాం. ఈఏడాది మొదటి మూడు స్థా నాల్లో నిలవాలనే లక్ష్యంగా పని చేశాం.పరీక్షా కేంద్రాల వివరాలు తెలపండి? జిల్లావ్యాప్తంగా 1503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవడమైంది. ఈనెల 18 నుంచి పరీక్షలు నిర్వహించనున్నాం. ఈమేరకు కలెక్టర్ పర్యవేక్షణలో పలుమార్లు సంబంధిత శాఖల అధికారులతో సమావే శాలు నిర్వహించాం. కాపీయింగ్, మాస్‌కాపీయింగ్ మొదలుకుని ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.సమస్యాత్మక కేంద్రాలెన్ని, వాటి నిర్వహణ చర్యలేమిటి? జిల్లావ్యాప్తంగా ఆరు పరీక్షాకేంద్రాలను సమస్యాత్మకమైనవి. చక్రాయపేట కెజిబివి, ఖాజీపేట బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, కాశినాయనలోని ఎపి మోడల్ స్కూల్, నందిమండలం జిల్లా పరిషత్ హైస్కూల్, కలసపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, కొండాపురం ఎపి ఎస్‌డబ్య్లుఆర్‌ఎస్ ఉన్నాయి. వీటన్నింటిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడమైంది.గ్రామీణ విద్యార్థుల రాకపోకలకు తీసుకున్న చర్యలేమిటి? గ్రామీణ విద్యార్థుల రాకపోకల సౌకర్యార్థం ఆర్టీసీ సౌకర్యం కల్పించాం. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. పరీక్షల పర్యవేక్షణకు స్క్వాడ్స్, మానిటరింగ్ సిబ్బంది వివరాలు తెలపండి? జిల్లా వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాల్లో 12,161 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి అదనంగా 153 మంది ఛీప్ సూపరింటెండెంట్లు, 153 మంది డిపార్టు మెంట్ ఆఫీసర్లను నియమించాం. సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లైయింగ్ స్క్వా డ్స్ బృందాలు పరీక్షల అబ్జర్వర్లు పరీక్షలను తనికీ చేయడం జరుగు తుంది.టెన్త్‌ప్రశ్నాపత్రాలు, సామగ్రి భద్రత గురించి తెలపండి? టెన్త్ పరీక్షల సామగ్రిని, సెట్-1 ప్రశ్నాపత్రాలను ఆయా మండలాలకు చేరవేశాం. త్వరలోనే సెట్-2 ప్రశ్నాపత్రాలు కూడా వస్తాయి. పోలీస్‌స్టేషన్లలో పటిష్టభద్రత మధ్య భద్ర పరచడమైంది. పరీక్షా సమయానికి పరీక్షా కేంద్రాలకు తరలించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
