పదో తరగతి విద్యార్థులకు ‘ప్రేరణ’

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినులకు సోమవారం ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహదయ ఫౌండేషన్‌ బిందు తాడివాక అమెరికా వారి ఆర్థిక సహకారంతో స్థానిక ఫ్రెండ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 85 మంది విద్యార్థినులకు పరీక్ష సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఇఒ శివన్నారాయణ మాట్లాడుతూ ఏడాది పాటు చదివిన పాఠాలను ఈ వారం రోజులు రివిజన్‌ చేయాలన్నారు. కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నించవద్దన్నారు. ప్రతి ప్రశ్నకు జవాబు రాయాలన్నారు. చెప్పారు. డాక్టర్‌ కష్ణ చైతన్య మాట్లాడుతూ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థినులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలన్నారు. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోవాలన్నారు. ఎఎస్‌క్ష్మి మహబూబ్‌ బాషా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తారని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తమకు సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తామని భరోసా కల్పించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ కె.రమాదేవి మట్లాడుతూ ఈ కార్యక్రమం తమ విద్యార్థులకు మంచి ప్రేరణ కలిగించినట్లు తెలిపారు. ఫ్రెండ్స్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థి దశకు 10వ తరగతి మొదటి పబ్లిక్‌ పరీక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఇఒ సయ్యద్‌ అక్బర్‌ బాషా, ఎఫ్‌ఫిహెచ్‌ఎస్‌ మసూద్‌ వలి, సిఆర్‌పి కూతల వంశీ , గురుకుల పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ పద్మావతి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

➡️