పరిష్కారాన్ని మానేసి కక్షసాధింపు సరికాదు

అమరావతిలో కొవ్వొత్తులతో నిరసన
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని కోరుతూ అంగన్వాడీలు 30 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా కక్షసాధింపు చర్యలకు పూనుకుందని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య విమర్శించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగం దారుణమని అన్నారు. సత్తెనపల్లిలోని సమ్మె శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సమస్యల పరిష్కరానికి మార్గం చూపాలేగాని కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించకూడదన్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన గత ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సుజాత, అహల్య, చాముండేశ్వరి, ధనలక్ష్మి, దుర్గాభవాని, జ్యోతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పట్టణంలో 30వ రోజు కొనసాగింది. చిన్నారులతో కలిసి అంగన్వాడీలు సమ్మె శిబిరంలో రిలేదీక్షలు చేశారు. యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ హజ్ర, డి.శాంతమణి మాట్లాడారు. అంగన్వాడీలకు ఐసిడిఎస్‌ అధికారులు, సూపర్వైజర్లు నోటీసులు ఇవ్వడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలతోపాటు గ్రాట్యుటి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, అంగన్వాడీలు సుజాత, జయశ్రీ, శివకుమారి, కవిత, బాజీబీ, స్వప్న, శివపార్వతి, గురవమ్మ సబియా పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. యూనియన్‌ నాయకులు ఉషారాణి మాట్లాడారు. ఇందిర, కె.పద్మావతి, శాంతలత, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా, శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : సురేష్‌ మహల్‌ రోడ్‌లోని సమ్మె శిబిరాన్ని ఎపిటిఎఫ్‌ ఉపాధ్యాయులు సందర్శించి సంఘీభావం తెలిపారు. షోకాజ్‌ నోటీసులకు భయపడొద్దని, బెదిరింపులకు లొంగొద్దని చెప్పారు. గంగినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ గంగినేని రాఘవ ఎపిటిఎఫ్‌ ఉపాధ్యాయులు వి.చంద్రమౌళి, ఎస్‌.మూర్తి, బి.వి నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, ఎస్కే షరీఫ్‌, గురుబాబు, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, శివరామకృష్ణ, ఆంజనేయులు, అంగన్వాడీ నాయకులు ఎఎల్‌ ప్రసన్న, డి.బీబులు, నిర్మల, సిహెచ్‌ గాయత్రి. పి.ఉమాశంకరి. ఎన్‌.కృష్ణకుమారి, జై.సూర్య, శ్రీదేవి, హరిత పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక గ్రంథాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా రిలేదీక్షలను యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి ప్రారంభించారు. ఎ.పద్మ, ఎం.విల్సన్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : సమస్యలను పరిష్కరించడం మానేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు డి.లకీëనారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంగన్వాడీ సమ్మెలో భాగంగా అమరావతిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని లకీëనారాయణ అన్నారు. సమ్మెకు మద్దతుగా న్యాయవాది నీలగిరి కోటయ్య మాట్లాడుతూ గౌరవ వేతనాలు ఇచ్చేవారిగా అంగన్వాడీలను గుర్తించిన ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించే హక్కు లేదని అన్నారు. అనంతరం అంగన్వాడీలు సమ్మె శిబిరం నుండి ప్రదర్శనగా గాంధీ బొమ్మ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి 30 సంఖ్య ఆకారంలో పెట్టారు. కొవ్వొత్తులతోనే మానవహారంగా ఏర్పడ్డారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు అంగన్వాడీలు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️