పొర్లు దండాలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలుపుతున్న కార్మికులు

ప్రజాశక్తి-మండపేట

వారి సమస్యలు పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పొర్లుదండాలు పెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి నాటికి 9వ రోజుకు చేరుకుంది. కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్‌, బంగారు కొండ, లోవరాజు, విజరు, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

 

➡️