పోలీస్‌ స్టేషన్లో టెన్త్‌ ప్రశ్న పత్రాలు

పోలీసు స్టేషన్‌కు చేరిన ప్రశ్న పత్రాల బాక్స్‌లను పరిశీలిస్తున్న ఎంఇఒ తదితరులు

ప్రజాశక్తి-సబ్బవరం

ఈనెల 18వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలను పోలీస్‌ స్టేషన్లో భద్రపరిచినట్లు స్థానిక ఎంఈఓ-2 బిఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. 10వ తరగతి ప్రశ్న పత్రాలు సెట్‌-2 గురువారం వచ్చాయని, వాటిని సరిచూసుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్లో భద్రపరిచామన్నారు. మండలంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల ఐదు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రతిభా విద్యాలయం, మదర్‌ పబ్లిక్‌ స్కూల్‌, రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూల్‌, సన్‌ రిడ్జ్‌ స్కూళ్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

➡️