పోస్టల్‌ ఉద్యోగుల ధర్నా

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని కోరుతూ పోస్టాఫీసు ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సివిల్‌ సర్వేంట్‌ హోదా వెంటనే ఇవ్వాలన్నారు. 12, 24, 36 అదనపు సర్వీసు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. గ్రూపు ఇన్సూరెన్స్‌ రూ. 5 లక్షలకు పెంచాల న్నారు. గ్రాడ్యూటి రూ. 5 లక్షలకు పెంచాలన్నారు. ఈ కార్యక్ర మంలో తపాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : పోస్టల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోస్టల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ టార్గెట్స్‌ పేరుతో జిడిఎస్‌ ఉద్యోగులపై వేధింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పోస్టల్‌ ఉద్యోగులు తదితరుతు పాల్గొన్నారు.

➡️