ప్రగల్భాలు పలికిన పంటల బీమా ఎక్కడ?

నరుకుళ్లపాడు వాగు సమీపంలోని పొలంలో దెబ్బతిన్న మినుము పైరును చూపుతున్న నాయకులు
ప్రజాశక్తి-అమరావతి : నష్టం వాటిల్లిన పంట ఫొటో తీసి పెట్టిన వెంటనే 25 శాతం బీమా పరిహారాన్ని చెల్లిస్తామని ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో చెప్పారని, అదెక్కడ అమలు చేస్తున్నారని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ ప్రశ్నించారు. ఫసల్‌ బీమాలో కంపెనీలకు చెల్లించాల్సిన 1.5 శాతం ప్రీమియాన్ని తామే చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. తుపాను నేపథ్యంలో దెబ్బతిన్న పొలాలను కౌలురైతు సంఘం, సిపిఎం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అమరా వతి మండలంలోని ఎండ్రాయి, నరుకుళ్ల పాడు, పెదమద్దూరు తదితర గ్రామాల్లో వాగులు పొంగిపొర్లడంతో రబీలో వేసిన కంది 350 ఎకరాలు, మినుము 70 ఎకరా లు, శనగ 1500 ఎకరాలు పూర్తిగా దెబ్బతి న్నాయని, రబీ పంటలను ప్రభుత్వం ఇప్పటికీ ఈ-క్రాప్‌లో నమోదు చేయలేదని అన్నారు. దెబ్బతిన్న పంటలన్నింటినీ సత్వ రమే అంచనా వేసి ఆర్‌బికెలు, సచివాల యాల వద్ద బాధిత రైతుల జాబితాను ప్రదర్శించాలని, జాబితాలో నమోదవ్వని రైతుల విన్నపాలను పరిగణలోకి తీసుకొని రైతుల సమక్షంలో పంటపొలాలను సంద ర్శించి నష్టాన్ని గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వాస్తవ సాగుదార్లయిన కౌలురై తులకే పరిహారం దక్చేలా చూడాలన్నారు. 13 ఏళ్ల కిందట నిర్ణయించిన ఇన్పుట్‌ సబ్బిడీని కాకుండా పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, సేద్యం ఖర్చులను పరిగణలోకి తీసుకొని పంట నష్ట పరిహారాన్ని పెంచాలని కోరారు. బీమా పరిహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అన్ని పంటలకు దిగుబడుల ఆధారిత పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొద్దిపాటి వర్షాలకు కూడా వాగులు పొంగి పంట పొలాలను దెబ్బతీస్తున్నాయని, వాగుల పరీవాహక ప్రాంతంలో చెట్లను తొలగించి, కల్వర్టులను పెంచి వాగు ప్రవాహం త్వరితగతిన వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాని అన్నారు. కరువుతో రబీలో వేసిన పంటలను రక్షించు కోవడానికి నీటి కోసం అష్ట కష్టాలు పడిన రైతులు, పంట చేతికి వచ్చే తరుణంలో వచ్చిన తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతి న్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతులను అన్ని విధాలా ఆదుకుని అండగా నిలవాలని కోరారు. కౌలురైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, పంట పూర్తిగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి రుణమాఫీ చేయాలని కోరారు. పరిశీలనలో సిపిఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు, మొహిద్దిన్‌వలి, రఫీ, నవీను, రాజు ఉన్నారు.

➡️