ప్రతి మహిళా స్వయం శక్తి సాధించాలి

ప్రజాశక్తి – కడప / కడప అర్బన్‌ ప్రతి మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని, హింసకు గురైనప్పుడు గహహింస చట్టం ద్వారా మహిళలకు కావాల్సిన రక్షణ, మనోవత్తి పొందవచ్చునని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎస్‌. బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురోగతి వైపు బాటలు వేస్తున్నారని చెప్పారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌ లో ముందస్తు మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు గజ్జల లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళ కమిషన్‌ ద్వారా మహిళకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి గుర్తించి కమిషన్‌ దష్టికి తీసుకెస్తే వెంటనే పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా పాటు పడుతుందని తెలియజేశారు. మహిళా అభివద్ధి, శిశు సంక్షేమ శాఖ కర్నూల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పి. రోహిణి మాట్లాడుతూ మహిళలు పిండ దశ నుంచే దాడులు ఎదుర్కొంటున్నారని, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలంటే ప్రతి మహిళా విధ్యావంతురాలై ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగివుండాలని అన్నారు. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి డి. శ్రీ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా అందించే సేవల గురించి వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళా ఉద్యోగులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో జిల్లా యందలి జిల్లా మహిళా అధికారులు, సిడిపిఒలు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఐసిడిఎస్‌, సూపర్‌వైజర్లు, అంగన్వాడీలు, సహాయకురాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ పురుషుల కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలను గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమాలలో మహిళల పాత్రను చర్చిస్తూ, రాజకీయాలలో మహిళా రిజర్వేషన్ల శాతం పెరగడాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాయచోటిలో అర్చనా నర్సింగ్‌ హోమ్‌ వైద్యురాలు డాక్టర్‌ సి.విజయ కుమారి, సీనియర్‌ లెక్చరర్‌ శివపార్వతి, కన్వీనర్‌ డాక్టర్‌ కల్పన, కో – కన్వీనర్‌ రాజేశ్వరి, డాక్టర్‌ సావిత్రి, అనిత, కష్ణవేణి, రాధిక, రేణుక ఇతర మహిళా అధ్యాపకేతర సిబ్బంది, మహిళా విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అంకాల నాగరాజు పాల్గొన్నారు. విద్యుత్‌ భవన్‌లో.. సమాజంలో మహిళలు తమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి ఎస్‌. రమణ అన్నారు. గురువారం కడప నగరంలోని విద్యుత్‌ భవన్‌ లోని సమావేశ మందిరంలో ముందస్తు జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలతో కేక్‌ కట్‌ చేయించి ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు నాగరాజు, హరిసేవ నాయక్‌, డిఇఇలు, విద్యుత్‌ సంస్థలోని మహిళలు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో.. ఏడి పి.వేణుగోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి పి.వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సాధికారిక సాధన దిశగా మహిళలు ముందడుగు వేయాలన్నారు. డిఎల్‌ పిఆర్‌ఒ సునీల్‌ సాగర్‌, ఎవిఎస్‌ నాగయ్య, అనంతరం మహిళా ఉద్యోగులందరూ సాధికారతకు సంఘీభావం వ్యక్తం చేస్తూ కలిసికట్టుగా కేకును కట్‌ చేశారు. కార్యక్రమంలో డిఎల్‌పిఆర్‌ఒ మస్తాన్‌ సాహెబ్‌, పిఆర్‌ఒ రవికుమార్‌, ఫోటోగ్రాఫర్‌ సోహైల్‌, ఈశ్వరయ్య, అజ్మతుల్లా, హరిబాబు, లక్ష్మీపతి, వీరారెడ్డి, నాగజ్యోతి పాల్గొన్నారు. టిడిపి ఆధ్వర్యంలో.. మహిళలకు అన్ని రంగాలలో ప్రత్యేక స్థానం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి వి.ఎస్‌. అమీర్‌ బాబు, సీనియర్‌ నాయకులు అలంకాన్‌ పల్లి లక్ష్మీరెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు మన్మోహన్‌ రెడ్డి అన్నారు. నగరంలోని అలంకాని పల్లె లక్ష్మీ రెడ్డి కార్యాలయంలో టిడిపి సీనియర్‌ మహిళ నాయకురాళ్లను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు జయరాం రెడ్డి, పాలకొండ గుడి మాజీ చైర్మన్‌ ఓబుల్‌ రెడ్డి, తెలుగు యువత నగర మాజీ అధ్యక్షులు మేకల వెంకటేష్‌ యాదవ్‌, నగర మాజీ మైనార్టీ అధ్యక్షులు ఇమ్రాన్‌, 39 వ డివిజన్‌ సీనియర్‌ నాయకులు ఇలియాస్‌, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాసర్‌ అలీ, నూర్‌ బాషా, గంగులయ్య కిషోర్‌ పాల్గొన్నారు. కెఎల్‌ఎంలో.. మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హజరత్‌ అయేషా కాలేజ్‌ ప్రిన్సిపల్‌ హసీనా మాట్లాడుతూ మహిళలు ఎన్నో పాత్రలు సక్రమంగా పోషిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.వి.రత్నమ్మ, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇంటాక్‌ ఆధ్వర్యంలో.. మహిళల రక్షణకు అవసరమైన ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకుని అవ గాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్‌ పీడీ డి. శ్రీలక్ష్మి తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్‌) కడప చాఫ్టర్‌ కన్వీనర్‌ లయన్‌ మానస కె.చిన్నపరెడ్డి, కో- కన్వీనర్‌ పీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌కెఆర్‌ అండ్‌ ఎస్‌కెఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ శశికళ , డాక్టర్‌ ఆర్‌.రంగనాథరెడ్డి, చిన్న కళావతి కళాశాల, డాక్టర్‌ సలీంబాష ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది అతిథులను ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్త వై. అసంతమ్మ, ఇంటాక్‌ సభ్యులు కొండూరు జనార్దన రాజు, కొండారెడ్డి, భారవి, రాఘవేంద్ర వర్మ, గొబ్బూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు. చెన్నూరులో..విజేత మహిళా మండలి ఆధ్వర్యంలో రెడ్డిగారివీధిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు జయశ్రీ, వెంకట సుబ్బమ్మ హాజరై మాట్లాడారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా అవసరమని చెప్పారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ‘నారిశక్తి పురస్కారం – 2024’ అవార్డ్‌తో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజేత మహిళా మండలి అధ్యక్షురాలు గొసుల అరుణ కుమారి, జయమని, సుబ్బమ్మ, శ్యామల, మీకోసం విష్ణు వర్ధన్‌, సువర్ణ, రహమతున్నిష, ఇతర సేవా సంస్థ ప్రతినిధులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. వేంపల్లె : సమానత్వం, అభివృద్ధిలో మహిళ పాత్ర చాలా గొప్పదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెరసాల యోగాంజనేయులు, ఎంపిపి లక్ష్మి గాయత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక వైఎస్‌ఆర్‌ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, వెలుగు కార్యాలయంలో, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారిని సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ నాగేంద్ర, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి, డాక్టర్‌ మల్లేశ్వరమ్మ, కో-ఆర్డినేటర్‌ కిరణ్మయి, శివ, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ సభ్యులు, నెహ్రూ యువ కేంద్రం యూనిట్‌ సభ్యులు, హెచ్‌ఎం శివ మునెమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాపాడు : మహిళలకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత అందుతుందని డాక్టర్‌ పి.ఓబులేసు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మహిళా డాక్టర్‌ కావ్య మాధురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఓ మహాదేవ్‌ యాదవ్‌, ఆరోగ్య విస్తరణ అధికారి యం.రాఘవయ్య, ఆశా నోడల్‌ పర్సన్‌ సుకన్య, సూపర్‌వైజర్స్‌ బాబురెడ్డి, సరస్వతి, యంఎల్‌హెచ్‌పిలు, ఏయన్‌యంలు, ఆసుపత్రి సిబ్బంది, ఫార్మసిస్ట్‌ సుభాషిణి, పర్యవేక్షకులు నారాయణరెడ్డి, భాస్కర్‌, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాంజనేయుల రెడ్డి తెలిపారు. జిల్లా సమతా కో-కన్వీనర్‌ హన్సా ఎస్తేర్‌, జెవివి జిల్లా కార్యదర్శి సుజన్‌ కుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో జెవివి మండల అధ్యక్షులు దినేష్‌, పీటర్‌, సుజరు, ఉపాధ్యాయులు శశికళ, సుగుణ, చౌడేశ్వరి, పావని, ఈశ్వరయ్య, ప్రభుకుమార్‌ పాల్గొన్నారు. మైదుకూరు : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జడ్పిటిసి లక్ష్మీ ప్రసన్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మైదుకూరు వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం కడప శాఖ, అమ్మ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి హాజరయ్యారు. వెలుగు ఎపిఎం సుజాత మాట్లాడారు. మై భారత్‌ వికసిత్‌ భారత్‌ నారి శక్తి ఫిట్నెస్‌ రన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఎపిఎం సుజాత, జడ్పిటిసి సభ్యురాలు ప్రసన్నలక్ష్మీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు వివిధ రకాల ఆటలు నిర్వహించి బహుమతులతోపాటు పాల్గొన్న ప్రతి మహిళకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో వాగ్దాడం శివశంకర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ఖాజా హుస్సేన్‌, శివగంగిరెడ్డి, చంద్రారెడ్డి, రసూల్‌, నెహ్రూ యువ కేంద్ర వాలంటరీ సురేంద్ర పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుస్మితా, డాక్టర్‌ లక్ష్మీ ప్రసన్న సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరు సమీపంలోని గౌతమి మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ రామ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు నాగూరు, రవీంద్రారెడ్డి, కళాశాల కో-డైరెక్టర్‌ శైలూష, డిప్లొమా ప్రిన్సిపల్‌ ప్రకాష్‌రావు, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️