ప్రభుత్వం దిగొచ్చే వరకూ సమ్మె

తుళ్లూరులో మోకాళ్లపై నిలబడి వేపాకులు తింటూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు, నాయకులు
ప్రజాశక్తి – వట్టిచెరుకూరు : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం పదో రోజుకు చేరింది. సమ్మెకు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన వట్టిచెరుకూరులోని శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు సందర్శించి మాట్లాడారు. మాతా శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు దశాబ్ధాలుగా సేవలంది స్తున్నారని చెప్పారు. అందరికీ పౌష్టికా హారం అందించే వారి కుటుంబాలే అరకొర జీతాలతో గడవడం కష్టమవుతోందని, దీనికితోపాటు తీవ్ర పనిభారం, రాజకీయ వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గత ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని వారు కోరుతున్నారని, అయినా ప్రభుత్వంలో సరైన స్పందన కనిపించడం లేదని విమర్శించారు. పైగా సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, వీటిని ఎదుర్కొని ఉద్యమించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, మండల కార్యదర్శి జి.నాగరాజు, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎ.పద్మ, నాయకులు నవరత్నమని, ధనలక్ష్మి, అనురాధ, విజయ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – ప్రత్తిపాడు
స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ తరుఫున రూ.వెయ్యిని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు అందించి మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నగరాజకుమారి, కుసుమ, సుభాషిణి, కరిమూన్‌, వనజా పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తుళ్లూరు
స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్వాడీలు వేపాకులు తింటూ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, రాజధాని డివిజన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు మద్దతు తెలిపి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిం చకుండా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోం దని మండిపడ్డారు. అంగన్వాడీలు సొంత డబ్బులతో గ్యాస్‌ సిలిండర్లు, తాగునీరు కొనాల్సి వస్తోందని, మరోవైపు విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా జీతాలు మాత్రం పెంచరా? అని ప్రశ్నించారు. కేంద్రాల తాళాలు పగలగొట్టి స్తున్నారని, అంగన్వాడీలు చేసే పని ఇతరులు చేస్తారా? అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సమ్మె ఉధృతమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూని యన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణలత, కరీమూన్‌, నాయకులు అన్నా మణి, రజని, కామేశ్వరి, విజయలక్ష్మి, కరుణ, సుజాత, షేక్‌ జానీబేగం, నాగమ ల్లీశ్వరి, సీత, పెద్దమ్మాయి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడికొండ
స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద సమ్మె శిబిరం వద్ద వంటావార్పుతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి సందర్శించి మద్దతుగా మాట్లాడారు. సమ్మె మొదలైన రోజున ప్రిన్సిపల్‌ సెక్రటరీ చర్చలకు ఆహ్వానించి బెదిరింపులకు పాల్పడ్డారని, మరోమారు మంత్రివర్గ కమిటీ అని పిలిచి సమస్యల పరిష్కారం చేసేది లేదని సమాధానం ఇచ్చారని, అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండి పడ్డారు. సిఐటియు మండల కార్యదర్శి వై.గాంధీరామ్మోహన్‌రావు, రైతుసంఘం నాయకులు సిహెచ్‌.భాస్కరరావు అంగన్వాడీలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-మంగళగిరి
స్థానిక మెయిన్‌ బజార్‌, గౌతమ్‌ బుద్ధ రోడ్‌లో అంగన్వాడీలు భిక్షాటన చేపట్టారు. అంబేద్కర్‌ సెంటర్‌లోని సమ్మె శిబిరాన్ని ఎయిమ్స్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. అధ్యక్షులు జి.కోటేశ్వ రరావు, కార్యదర్శి పి.శివశంకర్‌, సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, వై.కమలా కర్‌, యూనియన్‌ నాయకులు హేమలత, జయశ్రీ, సుహాసిని, రుక్మిణి, టిడిపి నాయ కులు ఎం.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-కొల్లిపర
మండల కేంద్రమైన కొల్లిపరలో సమ్మె శిబిరానికి ప్రీస్కూల్‌ పిల్లలు, తల్లిదండ్రులు వచ్చి సంఘీభావం తెలిపారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి కె.చంద్రశేఖర్‌, అధ్యక్షులు నిర్మల జ్యోతి, విశ్రాంతకుమారి, సంతోష్‌ కుమారి, శ్రీలక్ష్మి, దీప్తి, మాధవి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌
స్థానిక విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా సమ్మె శిబిరాన్ని లబ్దిదారులు, చిన్నారులు సందర్శించి మద్దతు తెలిపారు. ఆటపా టలతో వినూత్న నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు కె.బాబూ ప్రసాద్‌, ఎవిఎన్‌ కుమారి మాట్లాడారు. సిఐటియు తెనాలి డివిజన్‌ కార్యదర్శి హుస్సేన్‌వలి. పి.పావని, ఎలిజబెత్‌, విజయకుమారి, రంగపుష్ప పాల్గొన్నారు.
ప్రజాశక్తి- మేడికొండూరు
ప్రధాన కూడలిలో భిక్షాటన చేశారు. యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ధనలక్ష్మి, శివపార్వతి, జమీల, స్వరూప పాల్గొన్నారు. కౌలురైతు సంఘం మండల కార్యదర్శి బి.రామకృష్ణ, సిపిఐ నాయకులు ఎం.శివశంకర్‌రావు మద్దతు తెలిపారు.
ప్రజాశక్తి – ఫిరంగిపురం
మండల కేంద్రమైన ఫిరంగిపురంలో మానవహారంగా నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌ నాగమల్లేశ్వరరావు సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. నాయకులు రజిని, సీతారాఘవ, సామ్రాజ్యం, అనురాధ, మల్లేశ్వరి, నందిని పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి
తహశీల్దార్‌ కార్యాలయం నుంచి పట్టణంలోని మెయిన్‌రోడ్డు మీదుగా అంగ న్వాడీలు ప్రదర్శన నిర్వహించారు. అనం తరం తాడేపల్లి నెహ్రు బొమ్మ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. యూనియన్‌ మంగళగిరి ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షులు వి.దుర్గారావు, యూనియన్‌ నాయకులు సరళ, తబితా, కిరణ్మరు, మాణిక్యం, శ్రీదేవి, భవాని, సుజాత, లక్ష్మి, శోభా, వరలక్ష్మి, ఫాతిమా, మాధూరి పాల్గొన్నారు.

➡️