ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేయాలని నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయంలో క్లస్టర్-2 ఇన్‌ఛార్జి కంచర్ల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో క్లస్టర్ పరిధిలోని యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. సూపర్ 6, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళికను తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, మంత్రూ నాయక్, శ్రీశైలపతి నాయుడు, వేగినాటి శ్రీనివాస్, బోడా చెన్నవీరయ్య, కామేపల్లి వెంకటేశ్వర్లు, కిశోర్, మహిళా నాయకురాలు రవణమ్మతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
