బండలాగుడు పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా వైసిపి గిద్దలూరు ఇన్‌ఛార్జి కుందురు నాగార్జునరెడ్డి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. రామాపురం గ్రామం శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, అనంతరం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వృషభ యజమానులు పాల్గొన్నారు.

➡️