బాలికపై లైంగిక దాడికి పాల్పడినఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలి

నిరసన తెలుపుతున్న ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి -మునగపాక :

అభం శుభం తెలియని పసిపిల్లపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాద్యాయుడు శివకోటి దుర్గాప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక దళిత కాలనీలోని బాధిత కుటుంబాన్ని ఐద్వా నాయకులు పి.మాణిక్యం, డిడి వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమణ, తరుణ్‌ తదితరులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఊసరవెల్లిగా మసలుతూ పసి పిల్లలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, దోషిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళ చేస్తామని హెచ్చరించారు.

➡️