బూచేపల్లి ప్రచారం

ప్రజాశక్తి-దర్శి: వచ్చే ఎన్నికల్లో వైసిపికి పట్టం కడితేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని దేవవరం పంచాయతీలో కట్టుబడివారిపాలెం, దేవవరం, శేషంవారిపల్లిలో మన ఊరికి మన శివన్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రథంపై ప్రచారం చేస్తూ మాట్లాడారు. గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటికి పెద్దపీట వేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు పూలు చల్లుతూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, ఆ గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️