బూచేపల్లి ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-దర్శి : దర్శి పట్టణంలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, దర్శి మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, మాదాసి నారాయణరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివ ప్రసాద్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టప్రక్కల గ్రామాల ప్రజలు స్వామి దర్శించుకున్నారు. తాపీ మేస్త్రీల ఆధ్వర్యంలో మహిళలు కోలాటం ప్రదర్శించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. దాతలు మజ్జిగ, పులిహోర అందజేశారు.

➡️