బేకింగ్‌ పదార్ధాల తయారీపై కెఎల్‌యులో పోటీలు

దీప్తి చంద్రికకు ప్రథమ బహుమతిని అందజేస్తున్న కెఎల్‌ యు అధ్యాపకులు

తాడేపల్లి రూరల్‌:  కెఎల్‌ డీమ్డ్‌ యూనిర్శిటీలోని మహిళా అభివద్ది ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు బేకింగ్‌ పదార్థాలు కేక్‌ లు, బ్రెడ్లు, బిస్కెట్ల తయారీపైన శుక్రవారం నాడు పోటీలను నిర్వహించారు. ఈ పోటల్లో వర్శిటీలోని పలు విభాగాలకు చెందిన విద్యార్థినులు పాల్గొని వివిధ రకాల కేకులు, బ్రెడ్లు, బిస్కెట్లను తయారు చేశారు. ఫుడ్‌ టెక్నాలజీ విభాగ ఆచార్యురాలు డాక్టర్‌ హేమ మాలిని, మహిళా డెవలప్మెంట్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ కె.రూత్‌ రమ్య, పూర్వ విద్యార్థుల విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కే సోని, బిఇఎస్‌ ఆచార్యురాలు కోనేరు శిరీషా, సిఎస్‌ఐటి ఆచార్యురాలు ప్రవీణా నూతక్కిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్బంగా మహిళా డెవలప్‌మెంట్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ కె.రూత్‌ రమ్య మాట్లాడుతూ విద్యార్థులు బేకింగ్‌ ఆహార పదార్థాల తయారీలో మెలకువలు నేర్చుకోవాలన్నారు రానున్న కాలంలో బేకింగ్‌ ఆహార పదార్థాలకు మరింత గిరాకీ పెరగనుందని తెలియజేశారు. విద్యార్థినులు తయారు చేసిన ఆహార పదార్థాల ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆమె కితాబిచ్చారు. అనంతరం మొజిటో మాజిక్‌ కప్‌ కేక్‌ తయారు చేసిన దీప్తి చంద్రిక, బి.ఆది త్యలకు ప్రథమ బహుమతి, గ్రేప్‌ కేక్‌ తయారు చేసిన సిఎస్‌ ఐటి విద్యార్థిని ఎం.విజయశ్రీ వర్ష, సిఎస్‌ఇ విద్యార్థిని పి.కీర్తిలకు ద్వితీయ బహుమతి, సిఎస్‌ఐటి విద్యార్థిని యు.అపర్ణ, సిఎఇ ఎస్కే.తన్హార్‌ లకు తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థి నులను వర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్ధ సారధివర్మ, ప్రో వైస్‌ చాన్సలర్లు డాక్టర్‌ ఎవిఎస్‌.ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌.వెంకట్‌ రామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బా రావు, విద్యార్ధి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్‌ సిహెచ్‌. హనుమంతరావు అభినందించారు. పరిసరాల శుభ్రత అందరి బాధ్యత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్ధి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్‌ సిహెచ్‌. హనుమంతరావు సూచించారు. శుక్ర వారం చిర్రావూరులో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ని చిల్ల చెట్లను వర్సిటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కో-ఆరి ్డనేటర్‌ పి.శ్రీకాంత్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వి. జోనితిన్‌ మాట్లాడారు.

➡️