భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

ప్రజాశక్తి-రామాపురం మహాశివరాత్రి సంధర్బంగా శుక్రవారం మండలంలోని హస నాపురం స్థానమలేశ్వరస్వామి శివాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దంప తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంప తులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు సుదీప్‌రెడ్డి, పప్పిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చలమారెడ్డి, సర్పంచ్‌ ఆంజనే యులు, మాజీ ఎంపిటిసి రమణ, హరినాధ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, అమర, కో-ఆప్షన్‌ హజీమ్‌, నాగార్జున పాల్గొన్నారు.బి.కొత్తకోట : మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని బీరంగి పంచాయతీ,గూగూటి కోనలో వెలసిన బండెన్నస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ సందర్భంగా బండెన్న స్వామి ఆశ్రమ పీఠాధిపతి పగడాల లక్ష్మీపతి స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రికి భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఆలయంలో నిర్వహించిన స్పటిక లింగం, బండెన్న స్వామి మూలవిరాట్‌కు పూజలు, అభిషేకం, చెక్కభజన, ఆర్కెస్ట్రా, సాసవల చిన్నమ్మ కథ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. నిరవధికంగా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కలికిరి : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం, గుట్టపాలెం పంచాయతీ కె.బర్నే పల్లి పూలకొండలోని బ్రమరాంబిక మల్లికార్జున ఆలయంలో భక్తులు శివనా మస్మరణతో విశేష పూజలు అందుకున్నారు. ఉదయం నుంచి హోమాలు, అభిషేకాలతో మొదలై రాత్రంతా పార్వతీ పరమేశ్వరుల కథ కాలక్షేపం, కోలాటలు, భక్తి గీతాలుతో జాగారం నిర్వహించారు. శనివారం శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారని, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు.పెద్దమండ్యం : మండలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామికి, పాపేపల్లి పంచాయతీ శివాలయం ల్లోనూ, శివపురం సమీపంలోని నేలమల్లయ్య స్వామికి, వెలుగళ్లు శివాల యంలోనూ సిద్దవరం మల్లికార్జున స్వామి, ముసలీకుంట శివాలయంలో ను వేదమంతాలతో పూజలు నిర్వహించి అభిషేకంపూజలు నిర్వహించారు. శివపురం నేలమల్లయ్యస్వామి ఆలయం, పెద్దమండ్యం శ్రీభ వాని శంకరాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి భజనలు ఏర్పాటు చేశారు. మల్లయ్య కొండలో వెలసిన మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు సౌకర్యాలు కోసం ఉచిత బస్సులను దాసిరిపల్లి జయ చంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పురహితులు మణికం ఠస్వామి, ప్రసాద్‌స్వామి, పణిస్వామి, జ్యోతి శంకర్‌స్వామి, అచ్చుతా స్వామి, పవనస్వామి, కష్ణమూర్తి స్వామి పాల్గొన్నారు.హత్యరాల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ‘చమర్తి’రాజంపేట అర్బన్‌ : హత్యరాల కామాక్షి త్రేతేశ్వరస్వామి ఊటుకూరు శివాల యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భక్తులు తండోప తండాలుగా పాల్గొన్నారు.మహాశివరాత్రి పురస్కరించుకొని రాజంపేట టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు శివాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనం తరం ఆలయ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. భక్తుల సౌక ర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజ నాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టిడిపి మాజీ మండల అధ్యక్షులు కొవ్వూరు సుబ్రహ్మణ్యంనాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్‌రాజు, ఊటు కూరు చంగల్‌రాయుడు, పెంచల్‌రాజు, రవీందర్‌ రెడ్డి, వేల్పుల బాలా, సాం బార్‌ లక్ష్మీనారాయణ, జగదాభి లక్ష్మీనారాయణరాజు, దేవరాజు వేణు గోపా లరాజు, లక్ష్మీపతి రాజు, రిటైర్డ్‌ ఏ.ఎస్‌.ఐ శ్రీనివాసరాజు, మండల సీని యర్‌ నాయకులు జీ.వి సుబ్బరాజు, కోటయ్య నాయుడు పాల్గొన్నారు.పీలేరు : మండలంలోని శైవాలయాలు జనసంద్రంతో నిండిపోయాయి. పీలేరు పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం, మండలంలోని శివరామపురం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయం, అడవిపల్లి శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రాత్రి జరిగిన పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాల్లో వైభవంగా నిర్వహించారు.

➡️