ప్రజాశక్తి -భీమవరం : భీమవరం పట్టణంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో వైయస్సార్ కాలనీలో మంగళవారం ధర్నా నిర్వహిచారు. ఈ సందర్బంగా సిపిఎం టౌన్ నాయకులు ఎం వైకుంఠరావు మాట్లాడుతూ కూటమిప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను అదుపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిందన్నారు. కిలో టమాటా రూ. 100 , ఉల్లిపాయలు రూ. 60 , పామాయిల్ గతంలో రూ. 80 ఉంటే ఇప్పుడు రూ. 120 అమ్ముతున్నారన్నారు. ధరలు పెరుగుదల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే పెరుగుతున్న నిత్యవసర వస్తు ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి నిత్యవసర వస్తువులు ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ధరలు పెరుగుదలకు వీరు కూడా బాధ్యులు అవుతారని విమర్శించారు. టమాట ఉల్లిపాయలు పప్పులు వీటిని రైతు బజార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న కాలంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ నాయకులు డి త్రిమూర్తులు ఎం మంగా కే అరుణ గాలి ప్రభావతి నాగలక్ష్మి రేణుక కామాక్షి ఎర్రంశెట్టి నాగమణి శ్రీను పట్నాల రేణుక పాల్గొన్నారు
