ప్రజాశక్తి-శింగరాయకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం శింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో టీ నాగేష్ కుమారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు, ఆడుదాం ఆంధ్రలో రాష్ట్రస్థాయిలో రెండో ప్రైజ్ తీసుకున్న మహిళా కబడ్డీ టీముకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరినీ ఎంపీడీవో నగేష్ కుమారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజను, ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యన్నాబత్తిన అరుణమ్మను, వైస్ ఎంపీపీ షకీలాను, ఎంపీటీసీలు బషీరాబానును, ఆగిపోగు సుమతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏవో బివి నరసింహమూర్తి, స్వచ్ఛభారత్ మండల కో-ఆర్డినేటర్ చిమట సుధాకర్, పాకల జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లి హజరత్తయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
