ప్రజాశక్తి – కడప అర్బన్ మహిళా సాధికారితతోనే దేశా భివద్ధి సాధ్యమ వుతుందని జిల్లా విద్యా శాఖాధికారి ఎం.అనురాధ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శంకరాపురంలోని స్కౌట్స్ హాలులో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు డి.సుజాతరాణి అధ్యక్షతన మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన డిఇఒ మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిం చడం శుభ పరిణామమన్నారు. మహిళాబి óవద్ధి విద్య ద్వారా మాత్రమే సాధ్య మవు తుందని పేర్కొన్నారు. విద్యాపరంగా అభి వద్ధి సాధించిన దేశాల్లో, రాష్ట్రాల్లో మహి ళలకు ప్రత్యేక స్థానముందన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా కొన్ని రంగాలలో స్త్రీలు అణిచివేతకు గురవుతున్నారన్నారు. ప్రత్యే కంగా రాజకీయ రంగంలో స్త్రీలపై నేటికీ వివక్ష కొనసాగుతుందని చెప్పారు. పురు షునితోపాటు అన్ని రంగాలలో స్త్రీలు సమా నంగా రాణించినా ఆర్థిక సమానత్వాన్ని సాధించలేకపోతున్నారన్నారు. ఆర్థిక సమానత్వం సాధించకపోవడంతో మిగిలిన రంగాలలో కూడా నిరాధారణకు గురవు తున్నారని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి డి.ప్రమీల మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కూడా స్త్రీల పట్ల వివక్ష, చిన్న చూపు తగదన్నారు. నేటికీ స్త్రీల పట్ల అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరగడం సమాజానికి మాయని మచ్చ లాంటిదన్నారు. స్త్రీలు విద్య ద్వారా చైతన్యవంతులై తమ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను, హింసను ప్రతి ఘటించాలని పిలుపునిచ్చారు. స్త్రీల అభివద్ధి జరగకుండా సమాజాభివద్ధి సాధించడం సాధ్యం కాదన్నారు. ఏ సమా జమైనా అన్ని రంగాలలో అభివద్ధి సాధిం చాలంటే మహిళాభివద్ధి ద్వారా మాత్రమే సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. స్త్రీలు తమ హక్కులతో పాటు, రక్షణ కోసం ఏర్పా టైన చట్టాల గురించి అవగాహన పెంచ ుకోవాలన్నారు. మహిళాభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యాలయాలలో, మహిళలు పనిచేసే సంస్థలలో పాలకులు ప్రత్యేక సదు పాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మహిళలు అబలలు కాదు సబలలు అనే రీతిలో అన్ని రంగాల్లో రాణిం చాలన్నారు. బాలికా విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలన్నారు. మహిళల పట్ల చూపు తున్న వివక్షతకు, అఘాయిత్యాలకు వ్యతి రేకంగా యుటిఎఫ్ ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. సదస్సు అనం తరం జిల్లా విద్యాశాఖాధికారితో పాటు పలువురు అధికారులకు, మహిళలకు సన్మానం చేపట్టి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జయనగర్ కాలనీ బాలి కోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యు.భాగ్యవతి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.పర్వీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.రూతు ఆరోగ్య మేరీ, నాయకులు ఏ.డి.దేవదత్తం, రమణమ్మ, శివకుమారి, వాణి పాల్గొన్నారు.
