మాధవరం’ఆత్మహత్య’లపై విచారణ జరిపించాలి

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ ఒంటిమిట్టకడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం చేనేత కుటుంబ ఆత్మహత్య ఘటన కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మధ్యాహ్నం సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్ర శేఖర్‌ బృందంతో కలిసి మాధవరంలో శనివారం ఆత్మహత్యకు పాల్ప డిన సుబ్బారావు కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం ఆత్మ హత్యకు దారి తీసిన కారణాలను మృతుని కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబీకుల దగ్గర ఉన్న పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇతర ఆధారాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ 2015లో ఒంటిమిట్ట పొలం పరిధిలోని సర్వే నెంబర్‌ 218.2, ఖాతా నెంబర్‌ 1712లో 2.10 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ వైసిపి నేతల అనుచరులు అప్పటి తహశీల్దార్‌, ఆర్డీఓల సహకారంతో సుమారు 600 ఎక రాలపైగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తొలగించి అన ర్హుల పేర్లతో ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఇందులోని నిజానిజాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో చోటుచేసుకున్న భూకబ్జాతో నిండు కుటుంబం బలి కావడంపై స్పందించాల్సిన అవ సరం ఉందన్నారు. కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై సమగ్ర విచా రణ చేపట్టి, బాధ్యులైన అధికారులు, సొంత పార్టీ నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్‌లో చోటుచేసుకునే ఇటువంటి దురాగతాలకు వైసిపి సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అండగా ఉంటాం : మాధవరం ఆత్మహత్య కుటుంబ సభ్యులకు ఉంటామని ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. మీ తరుపున సిపిఎం పోరాటం చేస్తుందని, సాధ్యమైన మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇందులోభాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి విచారణకు ఆదేశించాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. మీ పొలం మీకు దక్కేలా ప్రయత్నించడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం తక్షణమే అందజేయాలని కోరతా మని తెలిపారు. ఆత్మహత్యలకు దారి తీసిన ఘటనకు గల కారణా లను పరిశీలన అనంతరం పిఎం కిసాన్‌ నిధులు జమ దగ్గర నుంచి మీ కుటుంబ అప్పుల అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మో హన్‌, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, అన్వేష్‌, ఒంటిమిట్ట, సిద్ధ వటం మండల కార్యదర్శులు కోనేటి నరసయ్య సురేష్‌బాబు పాల్గొన్నారు.అప్పుల వల్లే ఆత్మహత్య : డిఎస్‌పి పాల సుబ్బా రావు, భార్య, కుమార్తె అప్పుల బాధతోనే ఆత్మ హత్యకు పాల్పడ్డారని కడప డిఎస్‌పి ఎం.డి. షరీఫ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన రిపోర్టు ప్రకారం మృతులు మత్తుమందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. పైగా మృతుడుపాల సుబ్బా రావుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో సంబం ధాలున్నాయని, అప్పుల బాధ తటు ్టకోలేక మాన సికంగా కుంగి ఆత్మ హత్యలకు పాల్పడినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఆర్‌డిఒతో మాట్లాడితే పాల సుబ్బారావు భూమిని ఎవరికీ పట్టా ఇవ్వలేదని సమా ధానమిచ్చారని చెప్పారు. వందశాతం న్యాయం చేస్తాం : జడ్‌పి చైర్మన్‌ బాధిత కుటుంబానికి వందశాతం న్యాయం చేస్తామని జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పేర్కొ న్నారు. మృతుల కుటుంబాలను పరామ ర్శించారు. కుటుంబంలో పెద్ద కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తామని, ఏ భూమికోసం ఆత్మహత్య చేసుకున్నా అదే భూమిని బాధిత కుటుంబానికి పట్టా రూపంలో ఇప్పించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. రూ. 50 వేల ఆర్థిక సాయం : టిడిపి పాల సుబ్బారావు కుటుంబానికి రాజంపేట టిడిపి నాయకులు బత్యాల చెంగల ్‌రాయుడు పార్టీ తరుపున రూ. 50 వేల ఆర్థిక సాయం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని సుబ్బా రావు పెద్ద కుమార్తె లక్ష్మిప్రసన్నకు భరోసా ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో భూ కబ్జాలు అధికమయ్యాయని, పేద కుటుంబాలతో చెలగాటమాడుతోందని వాపోయారు.టిడిపి అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం : సిపిఐ బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆదివారం మతుల కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు అన్ని విధాలా ఆదుకుంటాం : జనసేన మృతుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్‌ పేర్కొన్నారు. పాలసుబ్బారావు పెద్ద కుమార్తె లక్ష్మి ప్రసన్నకు రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌తో మాట్లాడి ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

➡️