‘మిషన్‌ ఇంద్రధనుస్సు’ను విజయవంతం చేద్దాం డిఎం అండ్‌ హెచ్‌ఒ

డాక్టర్‌ కొండయ్యప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ శిశువుల్లో, గర్భిణుల్లో వంద శాతం వ్యాధినిరోదకతను పెంచే సరికొత్త, మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని సమిష్టి కషితో జయప్రదం చేద్దాం అని ఆదివారం అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య అన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మిషన్‌ ఇంద్రధనుస్సుపై ఆరోగ్య సిబ్బందికి, వైద్యులకు ఒకరోజు పాటు రెండు దశలుగా శిక్షణా కార్యక్రమం ఇచ్చామని చెప్పారు. ఐదు సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకూ, ప్రతి గర్భిణికీ ఇప్పటివరకు అందని అన్ని వ్యాధినిరోధక టీకాలు వేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మీసిల్స్‌, రూబెల్లా వ్యాధులను 2023 సంవత్సరం అంతానికి తరిమివేయడమే అని అన్నారు. సూక్ష్మ ప్రణాళిక వారిగా ఇంటింటికి తిరిగి జిల్లాలోని 501 సచివాలయ పరిధులలో ఆరోగ్య సిబ్బందిచే లబ్ధిదారులను గుర్తించామన్నారు. గుర్తించిన బిడ్డలకు, గర్భిణులకు మూడవ విడత ఈనెల 11 నుంచి 16 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రౌండ్‌కు ఆరు రోజులు నిర్దేశించిన గ్రామాల్లో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్స్‌ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గ్రామ ఆరోగ్యకేంద్రాలకు, సచివాలయాలకు, అంగన్వాడీ కేంద్రాలకు పంపావ ున్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే లో 2సం లోపు వ్యాకిన్‌ వేసుకోవాల్సిన చిన్నారులను గుర్తించారన్నారు. .హెడ్‌ కౌంట్‌ సర్వే లో ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు పూర్తిగా అందాయా లేదా అని, గర్భిణులకు టిడి టీకాలు వేసుకున్నారా లేదా అని సర్వేలో ఇంటింటికి వెళ్లి అడిగి విచారించాలన్నారు. పిల్లలలో లెఫ్ట్‌ ఔట్‌, డ్రోపౌట్స్‌ వారిని గుర్తించామన్నారు. అన్ని లైన్‌ డిపార్ట్‌మెంట్‌ వారితో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్య శాఖ, పంచాయతీ రాజ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయం సాధించాలన్నారు.

➡️