ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ఉప్పుగుండూరు గ్రామంలో వాసవీ క్లబ్ మరియు షటిల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో షటిల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. మొత్తం 40 టీములు పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి బహుమతిని ఒంగోలు లోకేష్ టీమ్ కైవసం చేసుకుంది. విజేతలకు సంగీతరావు జ్ఞాపకార్ధం ఆయన మనుమలు అందచేసిన రూ.4,116 అందజేశారు. ద్వితీయ బహుమతిని షటిల్ ప్రెండ్స్ ఉప్పుగుండూరు టీమ్ గెలుచుకుంది. విజేతలకు దాత రామోహనరావు సహకారంతో రూ.3,116 రూపాయలు అందజేశారు. తృతీయ బహుమతిని వేటపాలెం కిరణ్ టీమ్ సాధించింది. విజేతలకు ఒరుగంటి క్రాంతి కుమార్ జ్ఞాపకార్ధం సిద్దార్ధ డిజటల్ వారి సహకారంతో రూ.2,116 అందజేశారు. నాల్గవ బహుమతిగా స్టాలిన్ కష్ణ టీమ్ సాధించింది. విజేతలకు ఒమ్మెవరం సర్పంచి పాలపర్తి బాలకోటి సాయంతో రూ.1,516 అందజేశారు. ఐదో బహుమతిని చీరాల సూర్యటీమ్ సాధించింది. విజేతలకు రాజేష్ భరత్ డిజిటల్ స్టూడియో సహకారంతో రూ.1,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మున్నంగి వెంకట్రావు, వాసవీ క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కొంజేటి వెంకట సురేష్ బాబు, వాసవీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
