యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా జ్యోతిబసు

ఎస్‌.జ్యోతిబసు

ప్రజాశక్తి – అమలాపురం

యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్‌.జ్యోతి బసు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌లో ఈ ఎన్నిక జరిగింది. జ్యోతిబసు 1989లో ఉపాధ్యాయునిగా విధుల్లో చేరారు. నాటి నుంచి మండల స్థాయిలో ప్రత్యక్ష, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2003లో మలికిపురంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు బాధ్యతలు నిర్వహించారు. యుటిఎఫ్‌ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులుగా పనిచేశారు. 2019లో కొత్తపేట మండలంలో జరిగిన జిల్లా కౌన్సిల్‌లో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో ఏజెన్సీ గంగవరంలో జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2020, 21లో కరోనా కాలంలో లాక్‌ డౌన్‌ కాలంలో ప్రజలకు సాయం అందించడంలో యుటిఎఫ్‌ కార్యకర్తలతో కలిసి తనవంతు కృషి చేశారు. 2021లో రెండోదశ కరోనా కాలంలో ఉపాధ్యాయుల కోసం కాకినాడ యుటిఎఫ్‌ కార్యాలయాన్ని ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చి కరోనా బాధిత ఉపాధ్యా యులకు సేవలంది ంచారు. 114 మంది కరోనా సోకిన ఉపాధ్యాయులకు గుండె ధైర్యాన్నిచ్చి వారి ప్రాణాలను కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. జిల్లాల విభజన తర్వాత కొత్తపేట మండలంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సంవత్సరం రావులపాలెం ఎంకెఆర్‌ కన్వెన్షన్‌ హోటల్‌లో జరిగిన కోనసీమ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యత నుంచి రిలీవ్‌ అయ్యా రాష్ట్ర కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 9, 10 తేదీల్లో ఏలూరులో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రతినిధిగా పాల్గొని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘలో తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర నాయకత్వం బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ నమ్మకం, బాధ్యతతో పనిచేస్తానని, సహకరించిన కోనసీమ జిల్లా నాయకత్వానికి, కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

➡️