రక్త హీనత నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

సమావేశంలో మాట్లాడుతున్నకలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌

పల్నాడు జిల్లా:  రక్త హీనత నివారణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు అవకాశం ఉంటుం దని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని భువన చంద్ర టౌన్‌ హాలులో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమా వేశంలో బంగారు తల్లి (హిమోగ్లోబిన్‌ ప్రోగ్రెస్‌ కార్డు) పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బంగారుతల్లి ప్రోగ్రెస్‌ కార్డులలో వివరాలు పూర్తిగా ఎప్పటికప్పుడు బ్లడ్‌ గ్రూపుతో సహా నమోదు చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ కార్యదర్శులు రక్త హీనత తక్కువగా ఉన్న పిల్లల తల్లులతో ప్రత్యేకంగా సమావేశమై కార్డు వివరాలు, పోషక ఆహరం అందించే విషయంలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి విద్యార్ధినికి ప్రోగ్రెస్‌ కార్డు అందచేయాలని సంబంధిత పాఠశాలల ప్రదానో పాధ్యాయులకు సూచించారు. బంగారు తల్లి ప్రోగ్రెస్‌ కార్డుల పై ప్రధానో పాధ్యా యులకు మహిళా శిశు సంక్షేమ కార్యదర్శు లకు మార్గ నిర్దేశం చేశారు. తద్వారా పిల్లల తల్లిదండ్రులకు రక్తహీనతపై వివరాలు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌. బి.రవి పాల్గొన్నారు.

➡️