రైల్వే గేట్ల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి

సత్తెనపల్లిరూరల్‌: రైల్వే గేట్లు మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంపి లావు శ్రీకృష్ణ ్ణదేవరాయలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపిను గుడిపూడి, లక్ష్మీపురం రైతులు శనివారం కలిశారు. రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ లు 33, 34 మూసి వేయాలన్న రైల్వే అధికారుల నిర్ణయం విషయమై వారు ఎంపీని కలిశారు. దీనిపై స్పందించిన శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ రామకృష్ణ కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ప్రజలకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మార్గాల్లో ఆర్వోబీల నిర్మా ణానికి ప్రతిపాదించాలని, డిఆర్‌ఎంను కోరారు. గుంటూరు – నడికుడి రైలు మార్గంలోని గుడిపూడి వద్ద ఉన్న రైల్వే గేట్‌ లు ఎల్‌ సి 33,34 ల వద్ద గేట్‌ లు నిలుపుదల చేస్తున్నామన్న అధికారుల నిర ్ణయాల మేరకు.. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేలా సంప్ర దింపులు చేయాలని, గుడిపూడి, లక్ష్మీ పురం గ్రామాలకు చెందిన 30 మంది రైతులు, ప్రజలు ఎంపీను గుంటూరులో కలిశారు. ప్రధానమైన ఈ మార్గాల ద్వారా సత్తెనపల్లి నుండి క్రోసూరు మండలంలోని కొన్ని గ్రామాలు, అబ్బూరుతో పాటు సత్తెన పల్లి మండలంలోని చాలా గ్రామాలకు రాకపోకలు జరుగుతాయని వివరించారు. ఎంపి విజ్ఞప్తి మేరకు డిఆర్‌ఎం సాను కూలంగా స్పందించారు. రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల స్థానంలో అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️