లెనిన్‌ స్ఫూర్తితో నిర్బంధాలను ఎదుర్కోవాలి

ప్రజాశక్తి-చీమకుర్తి : సోషలిస్టు రాజ్య వ్యవస్థాపకుడు లెనిన్‌ స్ఫూర్తితో నిర్బంధాలను ఎదురొడ్డి పోరాడాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.మాబు పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లెనిన్‌ శతవర్ధంతి సభ నిర్వహించారు. సభకు సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ లెలిన్‌ పోరాడి సాధించిన సోషలిస్టు రాజ్యం ప్రభావంతో వచ్చిన 8గంటల పనిదినాన్ని ,కార్మికుల హక్కులను నేటి మన పాలకులు కాలరాస్తున్నారన్నారు. నేటి పాలకులు కనీస అవసరాలను వ్యాపారమయం చేసి అంబానీ,ఆదాని లాంటి కార్పొరేట్లకు దోచి పెడుతున్నారన్నారు. లెలిన్‌ పోరాడి సాధించిన వ్యవస్థ రావాలంటే కార్మికులు, రౖతులు,వృత్తిదారులు,ఉద్యోగుల మధ్య ఐక్యత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి, జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, మండల కార్యదర్శి తాళ్ళూరి శ్రీను, రైతు సంఘం మండల కార్యదర్శి కె.చిన్నపురెడ్డి, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి టి.రామారావు పాల్గొన్నారు.

➡️