వన సమారాధన ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంఎల్‌సి తోట తదితరులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక గొల్లపుంతకాలనీలోే వైసిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. వనసమారాధన ఏర్పాట్లను ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, వైసిపి నేత రెడ్డి రాజబాబు, పార్టీ నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, పోతంశెట్టి వరప్రసాద్‌, ముమ్మిడివరపు బాపిరాజు, పెంకే గంగాధర్‌, పిల్లి శ్రీనివాస్‌, మొండి మురళి తదితరులతో కలిసి శనివారం పరిశీలించారు. భోజననాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంఎల్‌సి తోట మాట్లాడుతూ నియోజక వర్గంలోని మూడు మండలాల ప్రజలంతా విచ్చేయలని ఆహ్వానిం చారు. జబర్దస్త్‌, ఆర్కెస్ట్రా, లక్కీ డిప్‌ వంటి వినోద కార్యక్రమాలను తిలకిస్తూ రోజంతా ఆనందంగా గడపాలని అభిలషిం చారు.

 

 

➡️