విజేతలకు బహుమతులు అందజేత

ప్రజాశక్తి-వెలిగండ్ల : వెలిగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో 5వ తరగతి విద్యార్థులకు గురువారం టాలెంట్‌ ట్టెస్ట్‌ నిర్వహించారు. ఈ టాలెంట్‌ టెస్ట్‌లో గోకులం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వై.వినోష్‌ ప్రథమ స్థానం, కె.నాగ అఖిల ద్వితీయ స్థానం, ఎంపిపిఎస్‌ కె.అగ్రహారం జనరల్‌ పాఠశాల విద్యార్థిని పి.శివ కీర్తి తతీయ స్థానం సాధించారు. విజేతలకు మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామచంద్రరావు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.రాఘవాచారి, విద్యాకమిటీ చైర్మన్‌ ఆకుల రవికుమార్‌, దాతలు ఎలికా రమణయ్య, గజ్జల తిరుపతిరెడ్డి, గోపవరపు శ్రీనివాసులు, ముక్కు వెంకటరెడ్డి, మల్లెబోయిన రమణయ్య, పి.మాధవరావు, ఎం.హరిబాబు, చేతల వెంకటరామయ్య, డి.రామిరెడ్డి, పవని వెంకట నాగరవికుమార్‌ ఎంఇఒ దాసు ప్రసాద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️