విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి

ప్రజాశక్తి-వీరబల్లి విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శనివారం వీరబల్లె మండలం ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళితే అనుకున్నది సాధించ వచ్చు నన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టు కుని తమ పిల్లలు బాగా చద వాలని పాఠశాలలకు పంపు తుంటారని విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. వంగిమల్ల గ్రామంలో ఆమూరివాండ్ల కిరణ్‌ సహకారంతో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పేరుతో లైబ్రరీ నిర్మించారని, ప్రతి విద్యార్థి లైబ్రరీలోని మంచి మంచి బుక్స్‌ చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకో వాలన్నారు. వంగిమల్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ అభివద్ధికి కషి చేస్తామన్నారు. జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తుందన్నారు. విద్యార్థి బాగా చదివి ఆర్డీవోలు, కలెక్టర్లు స్థాయికి ఎదగాలన్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్థుల చదువుకు ఫీజు రీయిం బర్స్మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థుల అభివద్ధికి కషి చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పాఠశాలలు తెలిసిన వెంటనే విద్యార్థులకు బుక్స్‌ యూనిఫామ్‌ అందజేసి ప్రతి విద్యార్థి బాగా చదివే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇస్తూ ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి చేశామన్నారు. ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు ప్రహరీ, వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, తహశీల్దార్‌ మహేశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌, సర్పంచ్‌ సరస్వతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️