ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు క్రీడల్లో రాణించి దర్శికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుదవారం ఆడుదాం ఆంధ్ర-ఇది అందరి ఆట కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో దర్శిలోని శివరాజ్‌నగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా రిబ్బన్ కట్ చేసి ఆటలను ప్రారంభించారు. అనంతరం క్రికెట్ ఆడి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు, ఈవోఆర్డీ జి శోభన్‌బాబు, కమిషనర్ మహేశ్వరరావు, ఎంఈఒలు కాకర్ల రఘురామయ్య, రమాదేవి, ఐదు మండలాల ఎంపీడీఒలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
