వైసిపి రాక్షస పాలనకు త్వరలో విముక్తి

జయహో బిసి సమావేశం

ప్రజాశక్తి పద్మనాభం : రాష్ట్రంలో సిఎం జగన్‌ నేతృత్వంలోని వైసిపి రాక్షస పాలనకు త్వరలో విముక్తి లభిస్తుందని .భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పద్మనాభం జంక్షన్‌లో పార్టీ మండల అధ్యక్షులు కోరాడ రమణ అధ్యక్షతన నిర్వహించిన జయహో బిసి సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బిసిల సాధికారిత టిడిపి పాలనలో సాధ్యమైందన్నారు. బిసిలకు 33శాతం రిజర్వేషన్లను టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్న ఎన్‌టిఆర్‌ కల్పించారన్నారు. వైసిపి పాలనలో బిసిలకు తీరని ద్రోహం జరిగిందని, కులం పేరుతో కార్పొరేషన్లు విడగొట్టి, చైర్మన్లు, పాలకమండళ్లను నియమించారే తప్ప, ఆయా కులాల అభ్యున్నతికి పైసా నిధులు విడుదల చేయలేదన్నారు. బిసిలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు, వైసిపి ప్రభుత్వానికి బిసిలంతా ఘోరీ కట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పాస్టర్ల ప్రసాద్‌, గంట నూకరాజు, కె.లీలావతి, బి పావని, దామోదరరావు, కె.వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు

మాట్లాడుతున్న రాజుబాబు

➡️