శివాలయాలకు పోటెత్తిన సందర్శకులు

 రెంటచింతల: మహాశివరాత్రి సందర్భంగా సత్ర శాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్ర వారం సందర్శకులు బారులు తీరారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన సత్రా లలో సుమారు 20వేల మందికి అన్న దానం జరిగింది. స్థానిక పరాశక్తి సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉచితంగా ప్రసాదం, మంచినీటి సదు పాయం ఏర్పాటు చేశాయి. స్థానిక ఎస్సై నారా యణరెడ్డి ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈవో నెమలిరెడ్డి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ బ్రహ్మారెడ్డి భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో పదవ అదనపు సెషన్స్‌ జడ్జి జి.వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ,టిడిపి మాచర్ల ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. పల్నాడు జిల్లా: కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరున్ని ఆం ధ్రప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ దంపతులు దర్శించు కున్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి జి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆల య అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వినుకొండ:వినుకొండ మండలంలోని విఠం రాజుపల్లి సాయి బృందావనం ఆవరణలో శాంతి ఆశ్రమం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు భార్య జి.లీలావతి పాల్గొన్నారు. వినుకొండలోని గంగినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీశైలం త్రిపురాంతకం, మానేపల్లి కోటప్పకొండ వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు, సిబ్బందికి అన్నం, పులిహోర, వాటర్‌ బాటిల్స్‌ అందజేశారు ముఖ్యఅతిథులుగా ఆర్టీసీ డిఎం మేనేజర్‌ కోటేశ్వర నాయక్‌ శ్రీనివాసరెడ్డి, జి. రాఘవ, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస రావు పాల్గొన్నారు. అలాగే, గంగినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎండను తట్టు కునేలా వైట్‌ టోపీలు అందజేశారు. కార్య క్రమంలో ఎం.సురేష్‌ వి.ప్రశాంత్‌, జి. గోవిందయ్య, ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలంలోని మన్నేపల్లి తండాలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవ స్థానం తిరుణాల సందర్భంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమ న్వయ కర్త కొంజేటి నాగశీను ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. సత్తెనపల్లి టౌన్‌ : మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం స్థానిక శివాలయం వద్ద దుర్గాసమేత కాశీవిశ్వేరుని ధర్మకర్తల మండలి సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగి అంకాళ్ళ ప్రభుదాస్‌ ప్రసాదాలు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభు దాస్‌ మాట్లాడుతూ ప్రసాదం పం పిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుదాస్‌ భార్య జయంతి పాల్గొన్నారు. మాచర్ల: మాచర్ల పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాలి. పట్టణంలోని రామప్ప దేవాలయం, దుర్గి మండలం తేరాల్లోని సిద్దేశ్వర స్వామి ఆల యం శివరాత్రి సందర్భంగా వేడుకలు జరిగాయి.దుర్గి మండలం తేరాల సిద్దేశ్వర స్వామి ఆలయ వద్ద వేడుకలలో కెసిపి సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మహా అన్న దానం నిర్వహించింంది. ఈ సందర్భంగా కెసిపి జనరల్‌ మేనేజర్‌ రమణారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ వేడు కలకు కెసిపి సంస్థ ద్వారా సహాయ సహ కారాలు అందిస్తూ ఉంటా మన్నారు. పది వేల మందికి పైగా సందర్శ కులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్య క్రమంలో కెసిపి అధికారులు వెంక టేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజయపురిసౌత్‌: శివరాత్రి సందర్భంగా నాగార్జున సాగర్‌ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరస్వామి జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వ ర్యంలో అనుపు నుంచి ప్రత్యేక లాంచీ సర్వీ సులను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనుపు వద్ద మాచర్ల రూరల్‌ సీఐ కె.సురేష్‌ పర్యవేక్షణలో విజయపురిసౌత్‌ ఎస్‌ఐ డి వి కొండారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేశారు.ఏపీ పర్యాటక శాఖకు లాంచీ ల ఆదాయం రూ.2.73 లక్షల ఆదాయం సమకూరింది. అలాగే విజయపురి సౌత్‌ లోని లాంచీ స్టేషన్‌ వద్ద శివాలయాన్నీ సందర్శకులు వెళ్లారు. విజయపురిసౌత్‌లోని పేటెరమ్మ దేవా లయంలో ఆలయ ధర్మకర్త మమ్ములేటి సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నందానం చేశారు. ముప్పాళ్ల: మహాశివరాత్రి సంద ర్భంగా మండలంలోని గ్రామా ల్లోని పలు శివాలయాలు సంద ర్శకులతో కిక్కిరిసి పోయింది. మండల పరిసర గ్రామాల నుంచి సందర్శకులు అధిక సం ఖ్యలో కోటప్పకొండ శైవక్షేత్రానికి తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా పండుగ పూట తెల్లవారు జామునే నుంచే ప్రతి ఏటా సతైనపల్లి నుంచి ప్రభలు ఊరేగింపుగా కోటప్పకొండ కు తరలి వెళ్ళ డం జరుగుతుంది. మండలంలోని గ్రామాల గుండా ప్రభలు వెళ్ళే క్రమం లో మండల కేంద్రమైన ముప్పాళ్ల నుంచి కోటప్పకొండకు వెళ్ళుతుం టాయి.ఈ ప్రభలను కొండకు తరలించేటప్పడు ఎద్దుల జతలు, కోడె దూడల జతల సహాయంతో తరలిస్తారు. ప్రభలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.

➡️