సంప్రదాయాలను గుర్తుంచుకోవాలి

ప్రజాశక్తి – రాచర్ల : మండల పరిధిలోని అనుములవీడు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్తలు, మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌ రెడ్డి, పిడతల ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారువేట కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ సంస్కతి సంప్రదా యాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. తొలుత పిడతల ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అనుమలవీడు గ్రామస్తులు, పిడతల అభిమానులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

➡️