సమస్యలు పరిష్కరించే వరకూ వెనకడుగు వేయబోంతమ న్యాయమైన డిమాండ్లను పరిష్క రించాలంటూ వైఎస్‌ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్, తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగ న్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రకరకాల ఎత్తు గడలకు పాల్పడుతోంది. కేంద్రాలకు తాళాలు పగుల గొట్టించడం, సచి వాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగిం చడం వంటి చర్యలకు పూను కుంటోంది. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీల ఆందోళనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పోరుమామిళ్లలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు అధికారులు పగలగొట్టడాన్ని నిరసిస్తూ ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీల సమ్మెకు సిఐ టియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియులతో పాటు సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన పార్టీలకు చెందిన నాయకులు సంపూర్ణ మద్దతు తెలియ జేశారు. వారి మద్దతుతో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృత రూపం దాల్చుతోంది. కార్యకర్తలు, ఆయాలు ఎక్కడికక్కడ కార్యాలయాల ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు( పుట్టపర్తి సర్కిల్ ) : మండ లంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గురు వారం ప్రొద్దుటూరు రూరల్ సిడిపిఒ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అంగన్వాడీ సమ్మెకు మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు సత్యనారాయణ సమ్మెను ద్దేశించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ వద్ద నిరసన, ఫిర్యాదు… అంగన్వాడీ కేంద్రాల తాళాల పగలగొట్టి తెరవాలని, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాల్లో అంగన్వాడీ కేంద్రాల తాళాలలు పగలగొట్టి తెరిచారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలన్నారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడీ కార్యకర్తలు రూరల్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలి యజేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్‌స్టేషేన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్, సిఐటి నాయకులు విజయకుమార్ సాల్మన్ పాల్గొన్నారు. పోరుమామిళ్ల : రాష్ట్రంలో లక్ష మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ ఉన్నారని అలాంటి వారి పైన బొబ్బిలి ఎమ్మెల్యే దుర్మార్గంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి నష్టదాయకమని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీ టీచర్ల పైన ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారా, అనే అనుచితమైన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంట్లో మహిళలు ఉన్నారని, అంగన్వాడీ టీచర్లు కూడా మహిళలే అని అన్నారు అంగన్వాడీ టీచర్లకు తమ న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని వాపోయారు. వెంటనే ఎమ్మెల్యే తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ, దస్తగిరిమ్మ, జ్యోతమ్మ ,రేణుకమ్మ, లక్ష్మీదేవి, వందల మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. వేంపల్లె: రాబోవు ఎన్నికల్లో ఓటు అనే అయుధంతో అంగన్వాడీలను ద్రోహం చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాలని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి అన్నారు. గురువారం అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు టిడిపి, ఎస్‌టియులతో పాటు,. వామపక్ష పార్టీలు సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీలతో కలిసి మోకాళ్ల్లపై నిలబడి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు సంఘమేశ్వరరెడ్డి, నరసింహరెడ్డి, రాజశేఖర్, టిడిపి నాయకులు నిమ్మకాయల మహమ్మద్ దర్బార్, డివి సుబ్బారెడ్డి, గోగుల మల్లికార్జున, బాలకష్ణారెడ్డి, వేమ నారాయణ, మహబూబ్ షరీఫ్, ఈశ్వ రయ్య, మహమ్మద్ ఇనాయతుల్లా, వెంకటయ్య, మడక శ్రీని వాసులు, రామాంజనేయురెడ్డి (చంటి) , గొగుల మారుతి, వెల్డింగ్ బాష, పోతిరెడ్డి శివ, సిపిఐ ఏరియా కార్యదర్శి బ్రహ్మంతో పాటు సిఐటియు, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు. ముద్దనూరు : అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యక ర్తలు కళ్లకు నల్లగుడ్డతో గంతలు కట్టుకుని మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేపట్టారు. తాళాలు పగులకొట్టి కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సచివాల కార్యదర్శి, సిబ్బంది మండలంలోని అన్ని కేంద్రాల తాళాలు పగులగొట్టారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు నిర్వాహణ బాధ్యతలు అప్పగించారు. దువ్వూరు : అంగన్వాడీ కార్మికులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మూడో రోజు వినూత్నంగా మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేశారు. అక్కడికి అంగన్వాడీ కార్యకర్త తన చంటి పాపతో వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. పాప వెక్కివెక్కి ఏడుస్తుంటే పక్కనే ఉన్న చెట్టుకు ఊయల కట్టి జోల పాడి నిద్రప ుచ్చిచ్చారు. బద్వేలు : స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద గురువారం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో మోకాళ్లపై నిలబడి తమ నిరసనను తెలియ జేశారు. అంగన్వాడీల నిరసనకు ఆయా ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మీదేవి, అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కె. సుభాషిని ప్రధాన కార్యదర్శి ఆర్. హుస్సేనమ్మ, ప్రాజెక్టు నాయకురాళ్లు సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి, కష్ణవేణి, ప్రవీణ, ఉమాదేవి, లక్ష్మీ నరసమ్మ, మహాలక్ష్మి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప అర్బన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సచివాలయ సిబ్బంది సెంటర్లు తెరవాలంటూ కొన్ని చోట్ల కార్యకర్తలపై ఒత్తిడి తీసుకువచ్చారు. భగత్‌సింగ్ నగర్, ఆర్.కె.నగర్, బాలాజీనగర్‌లో సెంటర్ల బీగాలు పగులగొట్టిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కార్యకర్తలు, ఆయాలు లేకుండా అంగన్‌వాడీ సెంటర్లు తెరిస్తే అక్కడ ఉన్న గుడ్లు, సరుకులకు లెక్కలు ఎలా అనే సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమ్మెకు విచ్చిన్నం చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. సిడిపిఒలు, సూపర్‌వైజర్లపై తీవ్రమైన ఒత్తి తీసుకువస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు సమ్మె విర మించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కార్యక్ర మంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్; సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు సుంకర రవి, నాయకులు ఓబులేసు, ఎపి అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అంజనీదేవి, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. బి. కోడూరు : మండలంలో అంగన్వాడీ వర్కర్లు మూడురోజుల నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ పాఠశాలలో రోజూ పౌష్టికాహారం అందించే బాధ్యతలను ప్రభుత్వం గ్రామ సచివాలయం, సెర్ఫ్ సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ సిబ్బంది తిరిగి విధుల్లోకి వచ్చేవరకూ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ పాఠశాలల్లో విధులు నిర్వహించాలని ఎంపిడిఒ భాస్కర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మైదుకూరు : రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం మైదుకూరు సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. వారి సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాహుల్, సిఐటియు నాయకులు జహింగీర్‌బాదష హాజరై సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ధనలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, కార్మికులు వేదమ్మ, లతా, లక్ష్మీదేవి పాల్గొన్నారు. సింహాద్రిపురం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు కేంద్రాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటి తాళాలు పగులగొడుతున్నారు. అధికారుల చర్యల పట్ల అంగన్వాడి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గురజాల, ఇందిరానగర్‌తో పాటు పలు కేంద్రాల వద్దకు పంచాయతీ సిబ్బంది వెళ్లి తాళాలు పగలగొట్టి అంగన్వాడి కేంద్రాన్ని తెరిచారు. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపిడిఒ కృష్ణ మూర్తి తెలిపారు. చింతకొమ్మదిన్నె : అంగన్వాడీ కార్య కర్తలు, ఆయాలు సమ్మె నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళా పోలీస్ చిన్నమ్మ, పంచాయతీ కార్య దర్శి పావని, విఆర్‌ఒ ప్రతాపరెడ్డి, విఆర్‌ఒలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారు. తలుపులు తెరచి అక్కడ ఉన్న స్టాకును పరిశీలించారు. బ్రహ్మంగారిమఠం : ఎపి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు అనుబంధం అంగన్వాడీి సమ్మె మూడవ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అనురాధ, మంజుల, లత, అన్నపూర్ణ, పద్మ, సరదా, రాణి, చెన్న కష్ణమ్మ, సిఐటియు నాయకులు భాస్కర్ పాల్గొన్నారు.
