సత్తెనపల్లి టౌన్ : సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడంతో పాటు తమ ఉద్యోగాలను పర్మి నెంట్ చేయాలని డిమాండ్ చెందుతుంటే మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 8వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా కార్మికులు అర్ధ నగ ప్రదర్శనలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటి, పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి జడ రాజకుమార్, జగన్నాథరావు, మున్సిపల్ జిల్లా సహాయి కార్యదర్శ చంద్రకళ, యూనియన్ నాయ కులు పెద వెంకయ్య పాల్గొన్నారు. మాచర్ల్ల : నిరవధిక సమ్మెలో భాగంగా మున్సి పల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రిలేదీక్షల శిబిరాన్ని యూనియన్ నాయకురాలు రమణ ప్రారంభించి మాట్లాడుతూ సమ్మె వలన ప్రజలకు కలిగే అసౌకర్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహిం చాలన్నారు. సిఐటియు నేత బండ్ల మహేష్ శిబిరాన్ని పర్యవేక్షించారు. కార్య క్రమంలో యూనియన్ నాయకులు అన సూయ, బి.చిన్నమ్మాయి, లక్ష్మీదేవి, డి. రమణ, ఇసాకు, ఆంజమ్మ, మల్లమ్మ, సుబ్బారావు, డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పిడుగురాళ్ల: పట్టణంలో కార్మికులు సమ్మె కొనసాగించారు. పిడుగురాళ్ల పురవీధుల్లో భిక్షాటన చేస్తూ కార్మికుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తమ సమస్యలు వెంటనే పరిష్క రించని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తా మని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్య క్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు పారిశుద్ధ కార్మి కులు కె.సీతారామయ్య, కె.కొండలు, అంగి రామారావు, నంద్యాల సురేష్, బత్తుల వెంకటేశ్వర్లు,తమ్మిశెట్టి శ్యాంకోటి, పద్మ వీరమ్మ,సుజాత అనంతలక్ష్మి, జయేంద్ర, వెంకటమ్మ పాల్గొన్నారు. వినుకొండ: మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్, సిఐ టియు జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి ఏఐటీయూసీ వినుకొండ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాస రావులు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికులను ఉద్దే శించి వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేసే పారిశుద్ధ్య, ఇంజ నీరింగ్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, పార్క్ వర్కర్స్ డ్రైనేజ్ వర్కర్స్, సూపర్వైజర్స్ తదితర రంగాలలో పనిచేసే వారందరిని పర్మినెంట్ చేయాలని తదితర డిమాం డ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎఐటియుసి నాయకులు బూదాల చిన్న, ఆర్. వందనం, సంపెం గుల రాజు, పచ్చిగొర్ల ఏసు, ఏసు పాదం, కంచర్ల కోటేశ్వరావు, రమణారెడ్డి, లిం గేశ్వరరావు, కోటేశ్వరమ్మ దేవమ్మ మార్తమ్మ కొండమ్మ మహిళ కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం కమిషనర్‌ని కలిశారు.
