ప్రజాశక్తి-మార్కాపురం: డిఆర్‌డిఎ సెర్ఫ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి బుధవారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సెర్ఫ్ జెఎసి జిల్లా వైస్ చైర్మన్ వేల్పుల ఎజ్రా మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి సెర్ఫ్ ఉద్యోగుల సమస్యలను తీర్చకుండా ప్రభుత్వం దాటవేత ధోరణితో ఉందని అన్నారు. రాష్ట్ర జెఎసి యూనియన్ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సెర్ఫ్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేం దుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకలమిట్ల ఏపీఎంలు రమేష్‌బాబు, దుగ్గెం పిచ్చయ్య, గోపాలకృష్ణారెడ్డి, మాణిక్యాలరావు, ఎల్‌సి నాగభూషణం, సీసీలు, ఎమ్మెస్ సిసిలు పాల్గొన్నారు.
